YS Avinash Reddy: అవినాశ్ రెడ్డిని ఏడు గంటల పాటు విచారించిన సీబీఐ
- వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా కడప ఎంపీ
- ఇటీవల అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి, పూచీకత్తుపై విడుదల చేసిన సీబీఐ
- ముందస్తు బెయిల్ సమయంలో ప్రతి శనివారం అవినాశ్ రెడ్డి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు
- ఈ నేపథ్యంలో నేడు విచారణకు హాజరు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డిని కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐ ఈ రోజు విచారించింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ప్రశ్నించింది. అవినాశ్ రెడ్డిని ఇటీవల అరెస్ట్ చేసిన సీబీఐ రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులపై ఆ వెంటనే విడుదల చేసింది. ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి శనివారం అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాలి. ఈ నేపథ్యంలోనే ఆయన నేడు విచారణకు హాజరయ్యారు.