Karimnagar District: మెడికల్ హబ్ గా మారనున్న కరీంనగర్: మంత్రి గంగుల

Karimnagar as Medical hub of telangana says gangula

  • రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నచోట ప్రభుత్వ మెడికల్ కాలేజీ అరుదు అన్న మంత్రి
  • కేసీఆర్ చొరవతో కరీంనగర్ కు మెడికల్ కాలేజీ అన్న గంగుల
  • మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతులను ఆలస్యం చేసిందని ఆరోపణ

రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నచోట ప్రభుత్వ మెడికల్ కాలేజీ రావడం అరుదైన విషయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో కరీంనగర్‌లో ఇది సాధ్యమైందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌ లో ఇప్పటికే రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు అదనంగా కరీంనగర్ జిల్లాకు కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వచ్చిందని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాకతో హైదరాబాద్, వరంగల్ తర్వాత కరీంనగర్‌ మెడికల్ హబ్ గా మారనుందన్నారు.

దురదృష్టవశాత్తు కేంద్రం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, మంత్రి హరీశ్ రావు చొరవతో కేంద్రం నుండి అనుమతులు తీసుకువచ్చారన్నారు. నూతన భవనంలో ఆగస్ట్ 8 నుండి క్లాసులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో క్లాసులు నిర్వహిస్తామన్నారు.

  • Loading...

More Telugu News