Magunta Raghava: సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగిపోయిన మాగుంట రాఘవ

Magunta Raghva surrendered after SC orders

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో గత ఫిబ్రవరి 10న మాగుంట రాఘవ అరెస్ట్
  • ఇటీవల మధ్యంతర బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ
  • జూన్ 12న లొంగిపోవాలని రాఘవను ఆదేశించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న మాగుంట రాఘవ సుప్రీంకోర్టు ఆదేశాలతో నేడు లొంగిపోయారు. ఆయన ఇటీవల బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు ఇటీవల రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అమ్మమ్మకు అనారోగ్యం, మరికొన్ని కారణాలు చూపుతూ ఆయన బెయిల్ పొందారు. 

అయితే ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మాగుంట రాఘవ చూపుతున్న కారణాలు సరైనవి కావని ఈడీ సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన అత్యున్నత న్యాయస్థానం రాఘవ బెయిల్ రద్దు ఉత్తర్వులిచ్చింది. జూన్ 12న సరెండర్ కావాలని ఆదేశించింది. మధ్యంతర బెయిల్ పరిమితి కుదించాలని స్పష్టం చేసింది. 

ఈ నేపథ్యంలో, నేడు ఢిల్లీ తీహార్ జైలు వద్ద మాగుంట రాఘవ లొంగిపోయారు. దాంతో రాఘవకు నేటి నుంచి మళ్లీ జ్యుడిషియల్ రిమాండ్ కొనసాగనుంది.

  • Loading...

More Telugu News