inflation: 25 నెలల కనిష్ఠానికి మే నెల ద్రవ్యోల్బణం

Retail inflation hits 25 month low in May on softer food prices and favorable base effect

  • మే నెలలో తగ్గిన ఆహార ఉత్పత్తుల ధరలు
  • మే నెలలో 4.25 శాతంగా నమోదయిన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్
  • ఆర్బీఐ లక్ష్యం 6 శాతం లోపు నమోదు

కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ద్రవ్యోల్బణం మే నెలలో 25 నెలల కనిష్ఠ స్థాయికి చేరుకొని 4.25 శాతంగా నమోదయింది. ఆర్బీఐ లక్ష్యం 6 శాతం లోపు నమోదయింది. మే రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెల నాటి 4.7 శాతంతో పోలిస్తే తగ్గింది. అదే సమయంలో 2022 మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.04 శాతంగా నమోదయింది.

కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఏప్రిల్ నెలలో 3.84 శాతం నమోదు కాగా, మే నెలలో 2.91 శాతానికి పరిమితమైంది. రూరల్ ద్రవ్యోల్బణం మే నెలలో 4.17 శాతంగా నమోదయింది. పట్టణ ద్రవ్యోల్భణం 4.27 శాతంగా ఉంది. మొత్తానికి మే నెలలో ఆహారం తదితర ఉత్పత్తుల ధరలు తగ్గాయి.

  • Loading...

More Telugu News