Tollywood: సీసీఎస్​ పోలీసులను ఆశ్రయించిన కరాటే కల్యాణి

Karate Kalyani complaints to CCS police over her photo morphing

  • తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో 
    వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు
  • లలిత్ కుమార్, అతని టీమ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు
  • సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం విషయంలో వార్తల్లో నిలిచిన కల్యాణి

ఖమ్మంలో కృష్ణుడు రూపంలో ఉన్న దివంగత సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించి వార్తల్లో నిలిచిన సినీ నటి కరాటే కల్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో తన ఫొటోలను మార్ఫింగ్ చేసి తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించారు. తన పాత ఫోటోలు, పాత సినిమా సన్నివేశాల ఫొటోలు ఇప్పుడు బయటకి తీసి వాటిని మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు కల్యాణి పిర్యాదు చేశారు. దాంతో, పోలీసులు 469,506,509 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారని తెలిసింది. 

ఇలా ఆమె ఫొటోలు వైరల్ చేస్తున్న చేస్తున్న లలిత్ కుమార్, అతని టీమ్ మీద కేసులు నమోదు చేసినట్టు సమచారం. తన ఎదుగుదల తట్టుకోలేక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కల్యాణి ఆరోపిస్తున్నారు. కాగా, ఎన్టీఆర్ విగ్రహం విషయంలో ఆమె పిటిషన్ ను విచారించిన హైకోర్టు విగ్రహావిష్కరణను నిలిపివేసింది. ఆ క్రమంలో ఎన్టీఆర్ విషయంలో కల్యాణి చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ షోకాజ్ నోటీసు జారీ చేసి 'మా' నుంచి ఆమెను సస్పెండ్ చేసింది.

  • Loading...

More Telugu News