Kotha Prabhakar Reddy: ఐటీ రెయిడ్స్ పై బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందన

BRS MP Kotha Prabhakar Reddy response on IT raids
  • నీతిగా వ్యాపారం చేస్తున్నానన్న కొత్త ప్రభాకర్ రెడ్డి
  • ఎన్నికల ముందు బురద చల్లేందుకే సోదాలు అంటూ విమర్శ
  • విదేశాల్లో పెట్టుబడులు పెట్టలేదని వెల్లడి
బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఈ ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ... తనకు, ఈ ఐటీ సోదాలకు సంబంధం లేదని చెప్పారు. కొందరు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి తాను వ్యాపారాలు నిర్వహిస్తున్నాననే ఆరోపణ కరెక్ట్ కాదని అన్నారు. ఐటీ అధికారులు తనకు జారీ చేసిన నోటీసులపై సమాధానం ఇస్తానని చెప్పారు. 

1986 నుంచి తాను బిజినెస్ చేస్తున్నానని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఎంతో నీతివంతంగా వ్యాపారం చేసుకుంటున్నానని తెలిపారు. ఎప్పుడూ లేని ఐటీ దాడులను ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు తనపై బురద చల్లేందుకే సోదాలు నిర్వహిస్తున్నట్టుందని విమర్శించారు. తన ఆస్తులకు సంబంధించిన ఆధారాలన్నింటినీ ఐటీ అధికారులకు చూపిస్తానని చెప్పారు. విదేశాల్లో తాను ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని తెలిపారు.
Kotha Prabhakar Reddy
BRS
IT Raids

More Telugu News