earthquake: బిపర్జోయ్ తుపానుకు ముందు గుజరాత్ కచ్‌లో భూకంపం!
- రిక్టర్ స్కేల్ పై 3.5తో భూమి చిన్నగా కంపించినట్లు వార్తలు
- గుజరాత్ తీర ప్రాంతం నుండి 45,000 మందికి పైగా పౌరుల తరలింపు
- రంగంలోకి 13 ఎస్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్
బిపర్జోయ్ తుపానుకు ముందు రోజైన బుధవారం సాయంత్రం గుజరాత్ లోని కచ్ లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై 3.5తో భూమి చిన్నగా కంపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా గుజరాత్ తీర ప్రాంతం నుండి 45,000 మందికి పైగా పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 13 ఎస్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్ లను రంగంలోకి దించారు. ఇండియన్ నేవీ షిప్స్ ను సిద్ధం చేసింది. బలమైన గాలులు వీస్తాయనే అంచనాలతో జామ్ నగర్ లోని రసూల్ నగర్ గ్రామంలో మొత్తం తాళ్లను కట్టారు.