Andhra Pradesh: సజ్జల సహా పలువురు సలహాదారుల పదవీ కాలం పొడిగింపు

YS Jagan to extend govt advisors tenure
  • పదవీకాలం పొడిగించేందుకు నిర్ణయం
  • కృష్ణమోహన్, కల్లాం, శామ్యూల్ కు కూడా వర్తింపు
  • ఇప్పటికే రెండుసార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారని తెలుస్తోంది. సజ్జల సహా నలుగురు సలహాదారుల పదవీకాలాన్ని మరికొంత కాలం పొడిగించాలని నిర్ణయించినట్టు సమాచారం. సజ్జలతో పాటు జీవీడీ కృష్ణమోహన్, అజయ్ కల్లాం, శామ్యూల్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు. వీరిని ముందుగా మూడేళ్ల పదవీకాలంలో నియమించింది. ఆ తర్వాత అందరకీ ఒకే పదవీకాలం ఉండాలంటూ రెండేళ్లకు కుదించింది. అయితే, ఇప్పటికే రెండుసార్లు పదవీకాలాన్ని పొడిగించిన ప్రభుత్వం మూడోసారి కూడా వారికి ఎక్స్టెన్షన్ ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
Andhra Pradesh
YS Jagan
Sajjala Ramakrishna Reddy

More Telugu News