Raghu Rama Krishna Raju: చంద్రబాబు ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వడం లేదు: రఘురామకృష్ణరాజు

Permissions are not giving to Chandrababu for house construction says Raghu Rama Krishna Raju
  • పవన్ పై దుర్భాషలాడటం మంచిది కాదన్న రఘురాజు
  • ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్య
  • టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయన్న ఎంపీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మీడియా ముఖంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో మాట్లాడుతూ... పవన్ పై పేర్ని నాని వ్యాఖ్యలు బాధను కలిగించాయని చెప్పారు. పవన్ పై దుర్భాషలాడటం మంచిది కాదని అన్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని... టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని అన్నారు. ఈ మూడు పార్టీలు కలవడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. 

కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న చంద్రబాబుకు అధికారులు అనుమతిని ఇవ్వడం లేదని రఘురాజు అన్నారు. ఇది జగన్ కు తెలిసే జరుగుతోందా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. జగనన్నకు చెప్పుకుందాం అనే పథకం ఫెయిల్ అయిందని... ఇప్పుడు జగనన్న సురక్ష అనే కొత్త టైటిల్ ని విడుదల చేశారని ఎద్దేవా చేశారు. అసలు జగనన్న సురక్ష పథకం ఏమిటని ప్రశ్నించారు.
Raghu Rama Krishna Raju
YSRCP
Perni Nani
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam

More Telugu News