Fake Constable: హైదరాబాదులో నకిలీ లేడీ కానిస్టేబుల్ అరెస్ట్

Hyderabad police arrests fake lady constable

  • తాను ఏఆర్ కానిస్టేబుల్ నని చెప్పుకుంటున్న యువతి
  • అశ్విని అనే పేరుతో ఐడీ కార్డు
  • ఉద్యోగం ఇప్పిస్తానని నాయక్ అనే వ్యక్తి నుంచి రూ.30 వేలు వసూలు
  • ఉద్యోగం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన నాయక్
  • మాయలాడి గుట్టురట్టు చేసిన పోలీసులు

పోలీస్ కానిస్టేబుల్ నని చెప్పుకుంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మోసాలకు పాల్పడుతున్న ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. విలాస జీవితానికి అలవాటు పడిన ఆ యువతి డబ్బు కోసం నకిలీ కానిస్టేబుల్ అవతారం ఎత్తింది. 

తన పేరు అశ్విని అని, తాను హైదరాబాద్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఆర్మ్ డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నానని నమ్మించేది. అందుకు తగినట్టుగా ఓ ఫేక్ ఐడీ కార్డు కూడా రూపొందించింది. 

లంగర్ హౌస్ కు చెందిన నాయక్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అతడి నుంచి రూ.30 వేలు వసూలు చేసింది. వారాలు గడుస్తున్నా ఉద్యోగంలో చేర్పించకపోవడంతో నాయక్ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు విచారణ జరపగా అమ్మడి భాగోతం బట్టబయలైంది. పోలీసు వేషంలో ఆమె పలువురిని మోసం చేసినట్టు గుర్తించారు. 

ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతీయువకులే ఆమె టార్గెట్. వారి నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్టు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News