KCR: బీఆర్ఎస్ లో ఎవరికి పడితే వారికి స్థానం ఉండదు: సీఎం కేసీఆర్

CM KCR inaugurates BRS Party office in Nagpur
  • మహారాష్ట్రలోని నాగపూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఏర్పాటు
  • ప్రారంభించిన సీఎం కేసీఆర్
  • రైతులు, యువతకే పార్టీలో ప్రాధాన్యం అని స్పష్టీకరణ
  • మహారాష్ట్రలో బీఆర్ఎస్ సుడిగాలి వేగంతో దూసుకెళుతోందని వెల్లడి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగపూర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ రాజకీయాల్లో మార్పులకు మహారాష్ట్ర నుంచే శ్రీకారం చుడతామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ గురించి చర్చించుకుంటున్నారని, మహారాష్ట్రలో అయితే బీఆర్ఎస్ సుడిగాలి వేగంతో దూసుకెళుతోందని అన్నారు. 

బీఆర్ఎస్ పార్టీ  కమిటీల్లో ఇప్పటివరకు లక్షల మంది చేరారని, అయితే ఎవరికి పడితే వారికి పార్టీలో చోటివ్వబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులకు, యువతకే తమ ప్రాధాన్యత అని వివరించారు.

దేశంలో మార్పు కోసం బీఆర్ఎస్ ఒక మిషన్ లా పనిచేస్తుందని తెలిపారు. త్వరలోనే ముంబయి, నాందేడ్ వంటి నగరాల్లోనూ బీఆర్ఎస్ కార్యాలయాలు ప్రారంభిస్తామని, మరింత జోరు పెంచుతామని కేసీఆర్ వెల్లడించారు.
KCR
BRS
Party Office
Nagpur
Maharashtra
Telangana

More Telugu News