West Bengal: వినూత్న నిరసన.. 22 కిలోమీటర్లు పరిగెత్తికెళ్లి ఎన్నికల నామినేషన్ దాఖలు
- బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా సొనాడ గ్రామ యువకుడి వినూత్న నిరసన
- కొండ ప్రాంతంలోని తమ గ్రామాన్ని నేతలు పట్టించుకోవడం లేదని ఆవేదన
- సమస్యల పరిష్కారానికి స్వతంత్రంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయం
తన గ్రామంలో అభివృద్ధి లేక విసిగిపోయిన ఓ వ్యక్తి వినూత్న శైలిలో నిరసన తెలిపాడు. దాదాపు 22 కిలోమీటర్ల దూరం పరిగెత్తికెళ్లి పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశాడు. బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా సొనాడ గ్రామంలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. కొండ ప్రాంతంలో ఉన్న తమ ఊరిని ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోవడం లేదని స్థానిక యువకుడు సనారా సుభా ఆవేదన వ్యక్తం చేశాడు. ఏళ్లు గడుస్తున్నా తమ సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో తానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.