COVID19: భారత్‌లో 96 కొత్త కరోనా కేసులు, రికవరీ శాతం 98.81

India records 96 fresh cases active case tally down to 2017
  • దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 2,017కి తగ్గుదల
  • 5,31,893కి చేరుకున్న కరోనా మృతుల సంఖ్య 
  • మొత్తం కరోనా కేసులు 4,49,93,282గా నమోదు
భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం 96 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కొవిడ్ యాక్టివ్ కేసులు 2,017కి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కరోనా కారణంగా దేశంలో మృతుల సంఖ్య 5,31,893కు చేరుకోగా, మొత్తం కరోనా కేసులు 4,49,93,282గా నమోదయ్యాయి. 

భారత్ లో కరోనా రికవరీ శాతం 98.81 గా ఉండటం గమనార్హం. మృతుల సంఖ్య 1.18 శాతంగా ఉంది. దేశంలో 220.66 కోట్ల కరోనా యాంటీ కొవిడ్ వ్యాక్సీన్ డోస్ లు ఇచ్చారు.
COVID19
Corona Virus

More Telugu News