Ram Pothineni: యువ హీరో రామ్ పెళ్లి వార్తలపై నిర్మాత స్రవంతి రవికిశోర్ స్పందన

Sravanthi Ravi Kishor condmens Ram Pothineni marriage speculations
  • త్వరలో రామ్ పెళ్లి అంటూ కథనాలు
  • ఓ బిజినెస్ మేన్ కుమార్తెను పెళ్లాడబోతున్నాడంటూ ప్రచారం
  • ఖండించిన రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్
  • రామ్ పెళ్లి కుదిరితే మేం చెబుతాం కదా అంటూ వెల్లడి
ఇటీవల శర్వానంద్ ఓ ఇంటివాడు కాగా, వరుణ్ తేజ్ నిశ్చితార్థం చేసుకున్న నేపథ్యంలో, యువ హీరో రామ్ పోతినేని కూడా పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. దీనిపై రామ్ పెదనాన్న, ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ స్పందించారు. రామ్ పెళ్లి వార్తలన్నీ నిరాధారం అని స్పష్టం చేశారు. రామ్ కు తగిన అమ్మాయి సెట్ అయి, పెళ్లి కుదిరితే తామే ఆ విషయం ప్రకటించేవాళ్లం కదా అని అన్నారు. రామ్ పెళ్లి విషయంలో రహస్యం ఏముంటుందని పేర్కొన్నారు. రామ్ పెళ్లి విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని, ఇప్పుడొస్తున్న వార్తలను నమ్మవద్దని స్పష్టం చేశారు. కాగా, వారియర్ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హైఓల్టేజ్ చిత్రంలో నటిస్తున్నాడు.
Ram Pothineni
Marriage
Speculations
Sravanthi Ravi Kishor
Tollywood

More Telugu News