Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 467 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 138 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 2.24 శాతం పెరిగిన బజాజ్ ఫిన్ సర్వ్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 467 పాయింట్లు లాభపడి 63,385కి చేరుకుంది. నిఫ్టీ 138 పాయింట్లు పెరిగి 18,826కి ఎగబాకింది. కన్జ్యూమర్ గూడ్స్, బ్యాంకెక్స్, పీఎస్యూ తదితర సూచీలు లాభాలను ముందుండి నడిపించాయి. ఫైనాన్స్, ఐటీ, రియాల్టీ, టెక్ సూచీలు నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (2.24%), టైటాన్ (1.87%), ఐటీసీ (1.34%), కోటక్ బ్యాంక్ (1.33%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.33%).
టాప్ లూజర్స్:
విప్రో (-2.15%), టీసీఎస్ (-1.25%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.32%), టెక్ మహీంద్రా (-0.24%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.13%).