JD Chakravarthi: కారు అంత స్పీడులో ఉండగా ఎన్టీఆర్ కళ్లు మూసుకున్నాడు: జేడీ చక్రవర్తి
- హీరోగా తన మార్క్ చూపించిన జేడీ
- డైరెక్షన్ వైపు కూడా వెళ్లిన హీరో
- ఎన్టీఆర్ తో స్నేహం గురించి ప్రస్తావన
- ఆ పాటలంటే ఆయనకి ఇష్టమని వెల్లడి
టాలీవుడ్ హీరోలలో జేడీ చక్రవర్తి స్టైల్ వేరు. హీరోగా తన మార్క్ చూపించిన జేడీ, ఆ తరువాత దర్శకుడిగా కూడా కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. ఇప్పుడు ఇటు నటుడిగా .. అటు డైరెక్టర్ గా తనకి నచ్చిన సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. తాజాగా ఆయన సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మాట్లాడాడు.
"ఒకప్పుడు నేను .. ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్. ఇద్దరం కూడా అప్పట్లో మెహదీపట్నంలో ఉండేవాళ్లం. ఇద్దరం కలిసి కార్లో తిరిగేవాళ్లం. ఎన్టీఆర్ కి నేను చేసిన 'గులాబీ'లోని 'మేఘాలలో తేలిపొమ్మన్నది' పాట అంటే ఇష్టం. అలాగే 'మృగం' సినిమాలో 'ఛల్ ఛల్ చెలి' అనే పాట కూడా ఇష్టం. ఆయన కార్లో ఎక్కువగా ఈ పాటలు ప్లే చేసేవాడు.
ఒకసారి మెహదీపట్నంలో రాత్రి 12:30 సమయంలో ఇద్దరం కార్లో వెళుతున్నాం. ఎన్టీఆర్ డ్రైవ్ చేస్తున్నాడు .. కారు 110 - 120 స్పీడ్ తో వెళుతోంది. ఇప్పుడు కళ్లు మూసుకుంటే ఎలా ఉంటుంది? అంటూ తను కళ్లు మూసుకున్నాడు. ఆ స్పీడ్ కే టెన్షన్ పడి చస్తున్న నేను, ఆయన కళ్లు మూసుకోగానే మరింత భయపడిపోయను. నాకు తెలిసి మధ్య .. మధ్యలో ఆయన కళ్లు తెరిచే ఉంటాడు. లేదంటే ఈ రోజున నేను మీ ముందుకు వచ్చేవాడినా ఏంటి? అంటూ నవ్వేశాడు.