Prabhas: దేశమంతటా ఆదిపురుష్​ మేనియా.. ప్రభాస్ ఎక్కడ?

Prabhas not appearing before and after Adipurush release
  • భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైన మెగా చిత్రం
  • మిశ్రమ స్పందనలో భారీ వసూళ్ల సొంతం
  • విడుదలకు ముందే అమెరికా వెళ్లిపోయిన ప్రభాస్
టాలీవుడ్‌తో పాటు భారత చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఆదిపురుష్ సినిమా గురించే చర్చ నడుస్తోంది. శుక్రవారం భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా వేలాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. టాక్ ఎలా ఉన్నా వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. తొలి రోజే రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది. అంతా బాగానే ఉన్నా సినిమా రిలీజ్ కు ముందు.. ఆ తర్వాత ప్రభాస్ ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా టాలీవుడ్‌లో తన సినిమాను మొదటిరోజే హైదరాబాద్‌ థియేటర్లలో చూస్తుంటాడు ప్రభాస్. ఇక్కడ అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో ఈ మధ్య ముంబై వెళ్లి చూస్తున్నాడట. 

బాహుబలి నుంచి సినీ ప్రమోషన్స్‌లో ప్రభాస్ చురుగ్గా పాల్గొంటున్నాడు. అయితే, ఆదిపురుష్ విషయంలో మాత్రం రెబల్ స్టార్ కాస్త డిఫరెంట్ గా వ్యవహరిస్తున్నాడు. అయోధ్యలో టీజర్ లాంచ్, తిరుపతిలో ట్రైలర్ లాంచ్ తర్వాత ప్రభాస్ ఎక్కడా కనిపించలేదు. ఏ ప్రమోషన్స్ లోనూ పాల్గొనలేదు. తిరుపతి ఈవెంట్ తర్వాత డార్లింగ్ యూఎస్ఏకి వెళ్లిపోయాడు. సినిమా ప్రమోషన్స్ కే తను ఫారిన్ వెళ్లాడన్న వార్తలు వచ్చినా అలాంటిది ఏమీ జరగలేదు. దాంతో, ఇంత మెగా సినిమా విడుదల సమయంలో ప్రభాస్ ఎక్కడున్నాడంటూ అభిమానులు, చిత్రవర్గాల్లో చర్చ మొదలైంది. ప్రభాస్ యూఎస్‌ఏలో ఆదిపురుష్ సినిమా చూశాడని, కొన్ని రోజుల విహార యాత్ర తర్వాత తిరిగొస్తాడని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Prabhas
adipurush
Tollywood
Bollywood
release

More Telugu News