South Central Railway: ప్రయాణికులకు గమనిక.. వారం రోజులపాటు 28 రైళ్ల రద్దు
- ఏపీ, తెలంగాణ సహా పలు ప్రాంతాలకు ప్రయాణించే రైళ్ల రద్దు
- ట్రాక్ నిర్వహణ పనుల నేపథ్యంలోనే నిర్ణయం
- 23 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా రద్దు
ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు ప్రయాణించే 25 రైళ్లను వారం రోజులపాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ పరిధిలో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా నేటి నుంచి 25 వరకు 28 రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది. మరో ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. గుంతకల్-బోధన్ రైలు సమయంలో మార్పులు చేసినట్టు పేర్కొంది. అలాగే, 23 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా నేటి నుంచి ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు.
రద్దయిన రైళ్లు ఇవే..
* కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-కాజీపేట (07753/07754)
* డోర్నకల్-విజయవాడ, విజయవాడ-డోర్నకల్ (07755/07756)
* భద్రాచలం-విజయవాడ, విజయవాడ-భద్రాచలం(07278/07979)
* సికింద్రాబాద్-వికారాబాద్, వికారాబాద్-కాచిగూడ (07591/07592)
* సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-హైదరాబాద్ (07462/07463)
* సిర్పూర్ టౌన్-కరీంనగర్, కరీంనగర్-సిర్పూర్ టౌన్ (07766/07765)
* కరీంనగర్-నిజామాబాద్, నిజామాబాద్-కరీంనగర్ (07894/07893),
* వాడి-కాచిగూడ (07751)
* ఫలక్‌నుమా-వాడి (07752)
* కాజీపేట-సిర్పూర్ టౌన్ (17003)
* బలార్షా-కాజీపేట (17004)
* భద్రాచలం -బలార్షా (17033)
* సిర్పూర్ టౌన్-భద్రాచలం (17034)
* కాజీపేట-బలార్షా, బలార్షా-కాజీపేట (17035/17036),
* కాచిగూడ- నిజామాబాద్, నిజామాబాద్-కాచిగూడ (07596/07593)
* నిజామాబాద్-నాందేడ్, నాందేడ్-నిజామాబాద్ (07853/07854)
* కాచిగూడ -నడికుడి, నడికుడి -కాచిగూడ (07791/07792)
పాక్షికంగా రద్దయినవి ఇవే..
నిన్నటి నుంచి ఈ నెల 24 వరకు దౌండ్-నిజామాబాద్ (11409) రైలును దుద్ఖేడ్-నిజామాబాద్ మధ్య, నేటి నుంచి 25వ తేదీ వరకు నిజామాబాద్-పండర్‌పూర్ (01413) రైలును నిజామాబాద్-ముద్ఖేడ్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. నేటి నుంచి 25 వరకు నంద్యాల- కర్నూలు సిటీ (07498) రైలును డోన్-కర్నూల్‌సిటీ మధ్య, కర్నూలు -గుంతకల్ (07292) రైలు కర్నూలు సిటీ-డోన్ మధ్య పాక్షికంగా రద్దయ్యాయి.. కాచిగూడ- మహబూబ్‌నగర్ (07583) రైలును ఉందానగర్-మహబూబ్‌నగర్‌ల మధ్య, మహబూబ్‌నగర్-కాచిగూడ రైలు(07584) మహబూబ్‌నగర్-ఉందానగర్‌ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు.