Tech-News: పంపిన వారికి తెలియకుండా వాట్సాప్ మెసేజ్ సీక్రెట్‌గా చదవడం ఎలా?
- మూడు మార్గాలు సూచిస్తున్న సైబర్ నిపుణులు
- రీడ్ రిసీట్స్ డియాక్టివేషన్, విడ్జెట్ వినియోగం, ఎయిర్‌ప్లేన్ మోడ్‌తో సమస్యకు పరిష్కారం
- వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యమిచ్చే వారికి ఇవి ఎంతో ఉపయోగకరం
వాట్సాప్ పాప్యులారిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! దీంతో మెసేజీలే కాకుండా, ఫొటోలు, చిన్న పాటి వీడియోలు కూడా సులభంగా షేర్ చేసుకోవచ్చు. ఇక వాట్సాప్‌లో వచ్చిన సందేశాలను మనం చదవిందీ లేనిది అవతలి వారికి బ్లూటిక్ మార్క్స్ సాయంతో తెలిసిపోతుంది. అయితే, ఈ ఫీచర్‌తో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని భావించేవారికి మూడు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
రీడ్ రిసీట్స్ని డిసేబుల్ చేయడం
మనం మెసేజీ చదివిందీ లేనిదీ తెలిసేదీ రీడ్ రిసీట్స్ ద్వారానే! సందేశం చదివిన వెంటనే బ్లూ టిక్ మార్కు వచ్చి అవతలి వారికి మనం మెసేజ్ చదివిన విషయం తెలిసిపోతుంది. అయితే సెట్టింగ్స్ లో ఈ ఫీచర్‌ను మార్చుకోవచ్చు. ఇందుకోసం ముందుగా సెట్టింగ్స్‌లోని అకౌంట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆపై ప్రైవెసీ ఆప్షన్లో ఉన్న రీడ్ రిసీట్స్ ఫీచర్‌ను డిసేబుల్ చేస్తే సమస్య పరిష్కారమైపోతుంది.
వాట్సాప్ విడ్జెట్ వినియోగించడం
వాట్సాప్ సందేశాలను హోం స్క్రీన్‌పై చూపించే విడ్జెట్ ద్వారా కూడా అవతలి వారికి తెలియకుండా సందేశాలను చదవొచ్చు. ఇందు కోసం, హోం స్క్రీన్‌పై ఖాళీ ప్రదేశంలో లాంగ్ ప్రెస్ చేస్తే విడ్జెట్ ఐకాన్ కనిపిస్తుంది. దీని సాయంతో వాట్సాప్ విడ్జెట్ ఎంచుకోవాలి. ఈ విడ్జెట్‌ను హోం స్క్రీన్‌పై డ్రాగ్ చేసుకుని కావాల్సిన సైజుకు పెంచుకోవాలి. ఆ తరువాత, ఇందులో కనిపించే మెసేజీలను వాట్సాప్ ఓపెన్ చేయకుండానే చదవచ్చు.
ఎయిర్‌ప్లేన్ మోడ్..
వినియోగదారులకున్న మరో మంచి ప్రత్యామ్నాయం ఎయిర్‌ప్లేన్ మోడ్. వాట్సాప్ మెసేజ్ చదివేముందు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను యాక్టివేట్ చేయాలి. దీంతో, సందేశం చదివినా కూడా రీడ్ రిసీట్ అవతలి వారికి చేరదు. ఇక మెసేజ్ చదవడం పూర్తయ్యాక మళ్లీ ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను డీయాక్టివేట్ చేయాలి. ఇలా చేస్తే మెసేజ్ పంపించిన వారికి తెలియకుండా మెసేజీలు చదువుకోవచ్చు. అయితే, చాటింగ్ చేసే సందర్భాల్లో ఈ పద్ధతి పనికిరాదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.