Kollu Ravindra: పేర్ని నాని ఇంటి వద్ద ఎస్సీ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది: కొల్లు రవీంద్ర

Kollu Ravindra made allegations on YCP leaders
  • యువతికి డ్రగ్స్ ఇచ్చి, మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడి
  • నిందితుడు ఆవుల సతీశ్ వైసీపీ నేత అని కొల్లు రవీంద్ర ఆరోపణ
  • పేర్ని నాని కుమారుడికి సతీశ్ స్నేహితుడని వెల్లడి
  • ఈ వ్యవహారం కేసు వరకు వెళ్లకుండా పేర్ని నాని అడ్డుకున్నారని వ్యాఖ్యలు
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఓ ఎస్సీ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. యువతికి డ్రగ్స్ ఇచ్చి, మద్యం తాగించి అత్యాచారం చేశారని వివరించారు. నిందితుడు వైసీపీ నేత కావడంతో పోలీసులు హైడ్రామా నడిపారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

 నిందితుడు ఆవుల సతీశ్... పేర్ని నాని కుమారుడికి స్నేహితుడు అని వెల్లడించారు. రాజకీయ దురుద్దేశంతో, ఈ వ్యవహారం కేసు వరకు వెళ్లకుండా పేర్ని నాని అడ్డుపడ్డారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. 

ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే పోలీసులు కేసు మాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Kollu Ravindra
Perni Nani
Machilipatnam
TDP
YSRCP

More Telugu News