West Indies: మరోసారి అర్థం కాని పోస్ట్ తో విరాట్ కోహ్లీ

Virat Kohli burns the internet with look for excuses message in build up to Indias tour of West Indies
  • ఇన్ స్టా గ్రామ్ లో అభిమానులను పలకరించిన కోహ్లీ
  • సాకులు వెతుక్కుందామా..? మెరుగుపడదామా? అంటూ పోస్ట్
  • ఫిట్ నెస్ పెంపు కోసం కసరత్తులు చేస్తున్న క్రికెటర్
వెస్టిండీస్ పర్యటనకు ముందు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ పోస్ట్ తో అభిమానుల ముందుకు వచ్చాడు. కోహ్లీ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ప్రతీ ముఖ్య సందర్భంలోనూ అతడు ఏదో ఒక పోస్ట్ లేదా ట్వీట్ తో పలకరిస్తుంటాడు. ‘‘సాకులు వెతుక్కోవడమా? లేదంటే మెరుగవ్వడానికి ప్రయత్నించడమా?" అంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. 

అంటే ఓటమి లేదా వైఫల్యాలకు సాకులు వెతుక్కోవడం కాకుండా మెరుగవ్వడానికి ప్రయత్నించాలన్నది కోహ్లీ సందేశంగా ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో కోహ్లీకి ఫాలోవర్లు చాలా ఎక్కువ. ప్రపంచంలో క్రిస్టియానో రోనాల్డో, లియోనెల్ మెస్సీ తర్వాత ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ముగిసి, వచ్చే నెలలో వెస్టిండీస్ తో సిరీస్ ఆరంభం కానుంది. దీనికి ముందు విరాట్ కోహ్లీ సాధనాలు చేయడం మొదలు పెట్టాడు. తద్వారా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడు. ఈ వీడియోను సైతం అతడు షేర్ చేశాడు.
West Indies
Virat Kohli
Instagram
post
fitness

More Telugu News