Ntr: ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి!
- 'భగవంత్ కేసరి' పనుల్లో బిజీగా అనిల్ రావిపూడి
- ఆ తరువాత ప్రాజెక్టు ఎన్టీఆర్ తో ఉండేలా సన్నాహాలు
- చరణ్ కోసం ఆల్రెడీ లైన్ సిద్ధం చేసిన దర్శకుడు
- ఈ ప్రాజెక్టులు ఆలస్యమైతే 'ఎఫ్ 4' సెట్స్ పైకి
అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా 'భగవంత్ కేసరి' అనే సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఈ సినిమా రూపొందుతోంది. కాజల్ - శ్రీలీల ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దసరాకి ఈ సినిమాను థియేటర్లకు తీసుకురానున్నారు.
ఈ సినిమా తరువాత ప్రాజెక్టును ఎన్టీఆర్ తో చేయాలనే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా సమాచారం. ఎన్టీఆర్ కోసం ఆయన ఒక కథను రెడీ చేసుకుంటున్నట్టుగా చెబుతున్నారు. ఇక చరణ్ కోసం ఆల్రెడీ ఒక లైన్ అనుకున్నాడని అంటున్నారు. అనిల్ దర్శకత్వంలో చేయాలనుకున్నట్టు గతంలో చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే.
అందువలన బాలకృష్ణ తరువాత సినిమాను ఎన్టీఆర్ చేసే దిశగా అనిల్ రావిపూడి సన్నాహాలు చేసుకుంటున్నాడట. అలాగే చరణ్ కోసం అనుకున్న లైన్ కి పూర్తి స్క్రిప్ట్ రూపాన్ని తీసుకురావడానికి కష్టపడుతున్నాడని అంటున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ - చరణ్ అందుబాటులోకి రావడానికి ఆలస్యమైతే, అప్పుడు 'ఎఫ్ 4' ను సెట్స్ పైకి తీసుకుని వెళ్లనున్నట్టు చెబుతున్నారు.