Hoduras: హోండురస్ మహిళా జైలులో మారణహోమం.. 41 మంది కాల్చివేత

41 women shot stabbed and burned to death in Honduras prison

  • కొందరిని కాల్చి చంపి, మరికొందరిని సజీవ దహనం చేసిన వైనం
  • మరాస్ వీధి ముఠాల పనేనన్న అధ్యక్షుడు
  • జైలు నుంచి పెద్ద ఎత్తున తుపాకులు, కత్తులు స్వాధీనం

హోండురస్ మహిళా జైలులో చెలరేగిన అల్లర్లు 41 మంది ప్రాణాలు తీశాయి. మరెంతోమంది గాయపడ్డారు. 26 మంది మహిళలు అగ్నికి ఆహుతికాగా, మిగతా వారిలో కొందరిని కాల్చి, కత్తితో పొడిచి చంపేశారు. హోండురస్ రాజధాని టెగుసిగలప్పకు 50 కిలోమీటర్ల దూరంలోని టమారా జైలులో ఈ దారుణం జరిగింది.  తీవ్రంగా గాయపడిన ఏడుగురు ఖైదీలకు టెగుసిగల్ప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు 41 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు ఫోరెన్సిక్ బృందం తెలిపింది. హింస తర్వాత జైలు నుంచి పలు తుపాకులు, పెద్దపెద్ద కత్తులు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ హింసాకాండపై హోండురస్ అధ్యక్షుడు సియోమరా కాస్ట్రో విచారం వ్యక్తం చేశారు. జైలులో ఆధిపత్యం కలిగిన మరాస్ వీధి ముఠాల పనేనని అన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. బారియో 18 ముఠా జైలులోని ఖైదీల సెల్ బ్లాకుల్లోకి చొరబడి కొందరిని కాల్చి చంపింది. మరికొందరిని తగలబెట్టింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News