Drunk man: మద్యం మోతాదు మించొద్దని చెప్పేది ఇందుకే..? వీడియో

Drunk man does push ups on high signboard in viral video

  • నియంత్రణ కోల్పోయేంతగా మద్యం సేవించిన యువకుడు
  • తర్వాత రోడ్డుపై ఎత్తయిన సైన్ బోర్డు ఎక్కి విన్యాసాలు
  • పుషప్ లు, పల్టీలతో దారినపోయే వారిని హడలెత్తించిన తాగుబోతు

మద్యం తాగొద్దని.. మరీ తప్పనిసరైతే మోతాదు మించొద్దని చెబుతుంటారు. కానీ, కొందరు మద్యం విషయంలో మరొకరి మాటను వినేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ముందు కొద్దిగానే అంటూ మొదలు పెట్టి, చివరికి నియంత్రణ కోల్పోయేంతగా తాగుతారు. అది ప్రమాదాలు, అనర్థాలకు దారితీస్తుంది. ఆరోగ్యం పాడైపోవడం దీర్ఘకాలంలో ఎలానూ జరుగుతుంది. 

మద్యం తాగి వాహనాలను నడపడం చట్టప్రకారం నేరంగా మార్చడం వెనుక కూడా ఇదే ఉద్దేశ్యం ఉంది. మద్యంతో మెదడు నియంత్రణ తప్పుతుంది. అది మనలోని అప్రమ్తతతపై ప్రభావం చూపిస్తుంది. మద్యం తాగి వాహనాలను నడపడం కారణంగా ఏటా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం ఎక్కువై కొట్లాటలు పెట్టుకునే వారిని చూశాం. కానీ, ఇక్కడ ఈ తాగుబోతు కథ వేరు. ఏకంగా రహదారిపై 15 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఓ సైన్ బోర్డుపైకి ఎక్కి విన్యాసాలు చేశాడు. పుషప్ లు తీశాడు. పల్టీలు కొట్టే ప్రయత్నం చేశాడు. అతడు తమ మీద ఎక్కడ పడతాడోనన్న భయంతో వాహనదారులు ఆగి చూడడం కనిపించింది. ఒడిశాలోని సంబల్ పూర్ లో ఇది జరిగింది.  (వీడియో కోసం)

  • Loading...

More Telugu News