Opposition Parties: పాట్నాలోని విపక్షాల సభకు 15 పార్టీల హాజరు.. ఎవరెవరు వచ్చారంటే..!

More than 15 parties attended opposition parties meeting
  • పాట్నాలో విపక్షాల సమావేశం
  • బీజేపీని గద్దె దింపడమే లక్ష్యం
  • భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్న విపక్షాలు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా బీహార్ రాజధాని పాట్నాలో విపక్షాలు భేటీ అయ్యాయి. 15కి పైగా పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. బీహార్ సీఎం నితీశ్ కుమార్ నిర్వహిస్తున్న ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో విపక్ష ఐక్య కూటమిపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు దూరంగా ఉన్నారు.
Opposition Parties
Patna
Meeting

More Telugu News