YS Sharmila: షర్మిల చేరికపై అధిష్ఠానం సానుకూలంగా ఉంది: కోమటిరెడ్డికి తెలిపిన డీకే శివకుమార్

High Command is positive about Sharmila inclusion says DK Shivakumar with Komatireddy
  • బెంగళూరులో డీకే శివకుమార్ తో కోమటిరెడ్డి భేటీ
  • 40 నిమిషాల పాటు చర్చలు జరిపిన నేతలు
  • షర్మిల చేరికపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన డీకే
తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల హాట్ టాపిక్ గా మారారు. ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. మరోవైపు షర్మిలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి విదితమే. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ విషయాన్ని స్పష్టం చేశారు. షర్మిలను పార్టీలో చేర్చుకోవడానికి పార్టీ హైకమాండ్ సానుకూలంగా ఉందని డీకే తెలిపారు. ఇదే సమయంలో నేతల అభ్యంతరాలపై కూడా ఆలోచిస్తున్నట్టు చెప్పారు. డీకేను కోమటిరెడ్డి బెంగళూరులో కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ దాదాపు 40 నిమిషాల సేపు చర్చించారు. ఈ సందర్భంగానే షర్మిల విషయంలో డీకే క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఇటీవలే డీకే శివకుమార్ ను షర్మిల కలిసిన సంగతి తెలిసిందే.
YS Sharmila
YSRTP
Komatireddy Venkat Reddy
Congress
DK Shivakumar
Karnataka

More Telugu News