laughter: కడుపుబ్బా నవ్వుకోండి.. ఆరోగ్యానికి ఎంతో మంచిది!

5 science based reasons why laughter is the best medicine

  • స్ట్రెస్ వల్ల గుండె జబ్బులు, మధుమేహం, కేన్సర్
  • నేటి ఆధునిక జీవనంలో పెరిగిపోయిన స్ట్రెస్
  • దీనికి విరుగుడు హాయిగా నవ్వుకోవడమే
  • దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్న అధ్యయనాలు

‘నవ్వు నాలుగు విధాలుగా చేటు’ ఇది వెనుకటి సామెత. దీన్ని అస్సలు పట్టించుకోవద్దు. కడుపుబ్బా నవ్వుకోండి. ఎందుకంటే నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సైన్స్ చెబుతోంది. నేటి ఉరుకుల పరుగుల జీవనంలో స్ట్రెస్ ఒక ప్రధాన సమస్యగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఈ స్ట్రెస్ అనేది గుండె జబ్బులు, మధుమేహం, కేన్సర్, రక్తపోటు వ్యాధులకు కారణమవుతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. నవ్వడం వల్ల రక్తంలో స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతున్నట్టు చెప్పాయి. కనుక నవ్వడం వల్ల వచ్చే ప్రయోజనాలను ఏంటో చూద్దాం.  

  • నవ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. నవ్వు స్ట్రెస్ (ఒత్తిడికి కారణమయ్యే) హార్మోన్లను తగ్గించేస్తుంది. వ్యాధి నిరోధక కణాలను ప్రేరేపిస్తుంది. ఇన్ఫెక్షన్ పై పోరాడే యాంటీబాడీలను, లింఫాటిక్ సిస్టమ్ ను కూడా ప్రేరేపిస్తుంది. దీంతో ట్యాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.
  • నవ్వడం వల్ల ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు విడుదల అవుతాయి. కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. శారీరకంగా, మానసికంగా విశ్రాంతి లభిస్తుంది.
  • నవ్వడం వల్ల గుండె రేటు పెరుగుతుంది. ఆక్సిజన్ స్థాయులు పెరుగుతాయి. వాస్క్యులర్ పనితీరు మెరుగుపడుతుంది. హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుంది.
  • రోజులో 10-15 నిమిషాలు నవ్వడం కూడా ఒక వ్యాయామమేనని తెలుసుకోవాలి. దీనివల్ల క్యాలరీలు కరిగి స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతాయి. కనుక స్ట్రెస్ హార్మోన్ల వల్ల బరువు పెరిగే ముప్పు  తప్పుతుంది. 
  • నవ్వును రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. చమత్కారమైన సంభాషణతో ప్రతి సందర్భంలోనూ నవ్వులు పూయించుకోవచ్చు. దీంతో ఆనందానికి ఆనందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. 

  • Loading...

More Telugu News