Eklavya Model school: తెలంగాణలో టీచర్ జాబ్స్.. ఏకలవ్య పాఠశాలల్లో 239 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Telangana Eklavya Model Residential Schools Recruitment 2023 for 239 PGT and TGT Posts

  • జులై 2 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి 
  • తాత్కాలిక ప్రాతిపదికన నియామకం
  • స్కూల్ క్యాంపస్ లోనే టీచర్లకు వసతి

తెలంగాణవ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన 239 గెస్ట్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈమేరకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు స్కూల్ క్యాంపస్ లోనే వసతి సదుపాయం కల్పిస్తారు. సీబీఎస్ఈ సిలబస్ ను ఇంగ్లిష్ లో బోధించాల్సి ఉంటుంది. అర్హత కల అభ్యర్థులు జులై 2 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ (టీఎస్‌ఈఎస్‌) ప్రకటన వెలువరించింది.  నోటిఫికేషన్ లింక్ ఇదిగో!

కావాల్సిన అర్హతలివే..
ఆయా సబ్జెక్టు స్పెషలైజేషన్ తో డిగ్రీ, పీజీ, బీఈడీ, పీహెచ్ డీ, ఎంఫిల్, ఎంఈడీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్ లో అర్హత సాధించడంతో పాటు టీచింగ్ అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయసు జులై 1, 2023 నాటికి 60 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక జరిగేదిలా..
అకడమిక్‌ మెరిట్‌, టీచింగ్ అనుభవం, నైపుణ్యాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) కు నెలకు రూ.35,750 చెల్లిస్తారు. అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) కు రూ.34,125ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మినహా మిగతా అభ్యర్థులు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. 

సబ్జెక్ట్ వారీగా ఖాళీల వివరాలు..
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు (పీజీటీ)
ఇంగ్లిష్- 15, హిందీ- 9, గణితం- 11, భౌతికశాస్త్రం- 18, కెమిస్ట్రీ- 5, జీవశాస్త్రం- 13, చరిత్ర- 16, భూగోళశాస్త్రం- 17, కామర్స్‌- 5, ఎకనామిక్స్‌- 10, తెలుగు- 07, ఐటీ- 13

ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ (టీజీటీ)
ఇంగ్లిష్- 27, హిందీ- 12, తెలుగు- 17, గణితం- 14, సైన్స్- 19, సోషల్‌ సైన్సెస్‌- 11

  • Loading...

More Telugu News