Kangana Ranaut: ‘ఎమర్జెన్సీ’లో అచ్చం ఇందిరను తలపిస్తున్న కంగన.. టీజర్ విడుదల

Kangana Ranaut drops new teaser announcing the release date for Emergency
  • దేశ నేత తన ప్రజలపైనే యుద్ధం ప్రకటించిన చీకటి చరిత్ర అంటూ ట్వీట్
  • నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • సినిమాకి దర్శకురాలు, నిర్మాత అన్నీ కంగనాయే
1975 ఎమర్జెన్సీ కాలం నాటి రోజులతో కూడిన కథాంశంతో రూపొందుతున్న ‘ఎమర్జెన్సీ’ సినిమా ఈ ఏడాది నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడం తెలిసిందే. ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రను కంగనా రనౌత్ పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను కంగన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 

ఈ సినిమాలో కంగన అచ్చం ఇందిరాగాంధీ మాదిరే కనిపిస్తుండడం గమనార్హం. ‘‘సంరక్షకురాలా, లేక నియంతా? మన దేశ నేత తన ప్రజలపైనే యుద్ధం ప్రకటించి నాటి రోజుల చీకటి చరిత్ర ఇది. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 24న ఎమర్జెన్సీ విడుదల కానుంది’’ అంటూ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ లో పేర్కొంది.  ఈ సినిమాకి దర్శకత్వం, నిర్మాణం అన్నీ కంగనాయే కావడం గమనార్హం.
Kangana Ranaut
teaser
Emergency
movie

More Telugu News