green matar: ఈ వీడియో చూస్తే రోస్టెడ్ బఠానీ తినడానికి ధైర్యం చాలదు!
- పచ్చి బఠానీలపై ఆకుపచ్చని రంగు
- రంగు ఆరిన తర్వాత బఠానీలను తీసుకెళ్లి నూనెలో వేయించడం
- అనంతరం ఉప్పు వేసి కలపడమే
షాపుల్లో విక్రయించే రోస్టెడ్ చానా గురించి తెలిసే ఉంటుంది. స్నాక్స్ కింద దీన్ని చాలా మంది తింటూ ఉంటారు. ప్రముఖ కంపెనీల దగ్గర్నుంచి స్థానికంగా చిన్న పాటి సంస్థలు దీన్ని తయారు చేసి విక్రయిస్తుంటాయి. ప్రముఖ బ్రాండ్లు అయితే కొంత నాణ్యత పాటిస్తాయనే నమ్మకం ఉంటుంది. మరి స్థానికంగా తయారు చేసే చిన్న పాటి సంస్థలు ఎంత వరకు పరిశుభ్రంగా, నాణ్యంగా తయారు చేస్తాయి? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే.
పచ్చి బఠానీని ఎలా రోస్ట్ చేస్తారు, దానికి గ్రీన్ పీస్ మాదిరిగా ఆకుపచ్చని రంగు ఎలా అద్దుతారనే విషయం చాలా మందికి తెలియదు. ఇన్ స్టా గ్రామ్ లో ఇందుకు సంబంధించిన వీడియోని తియాసా బోవల్ అనే వ్యక్తి షేర్ చేశారు. దీన్ని చూస్తే మరోసారి రోస్టెడ్ బఠానీ తినడానికి ధైర్యం చేయకపోవచ్చు. ముందుగా పచ్చి బఠానీకి ఆకు పచ్చని రంగు జల్లి, అనంతరం వాటిని ఆరబోసి అనంతరం వాటిని బకెట్లలో తీసుకెళ్లి మరుగుతున్న నూనెలో పోసి, తర్వాత బయటకు తీసి.. వేగంగా తిరిగే ఓ బౌల్ లో పోస్తున్నారు. దీంతో అధికంగా ఉన్న నూనె బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత వాటిని పెద్ద ఐరన్ ట్రేలో పోసి ఉప్పు చల్లి కలియబెడతారు. అంతే.. రోస్టెడ్ బఠానీ రెడీ. ఇది చూసిన తర్వాత తినడమా, లేదా అన్నది మీ ఇష్టం. ఎందుకంటే ఇలా స్థానిక సంస్థలు ఏ నూనెను వాడుతున్నాయో తెలియదు. అక్కడి పరిశుభ్రత కూడా ఆందోళన కలిగించేదిగానే ఉంది. (వీడియో కోసం)