Rajanikanth: చెల్లెలు సెంటిమెంట్ కి భయపడని కీర్తి సురేశ్!

Keerthi Suresh Special
  • 'పెద్దన్న'లో రజనీకి చెల్లెలుగా మెప్పించిన కీర్తి సురేశ్ 
  • ఆమెను చిరూకి చెల్లెలుగా చూపించనున్న 'భోళాశంకర్' 
  • టెన్షన్ పడవలసిన పనిలేదంటున్న బ్యూటీ 
  • ఇలా తన ముచ్చట తీరిందని వెల్లడి 
హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో, సీనియర్ స్టార్ హీరోలకి చెల్లెలుగా చేయమని అడిగితే చాలామంది ఒప్పుకోరు. ఎందుకంటే ఇక్కడ ఒక ముద్రపడితే దాని నుంచి తప్పించుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. ఆ తరువాత కూడా అంతా చెల్లెలు పాత్రల కోసమే అడుగుతూ ఉంటారని కంగారు పడుతుంటారు. 

కానీ కీర్తి సురేశ్ అలా భయపడకపోవడం విశేషం. తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అలాంటి కీర్తి సురేశ్ ఆ మధ్య రజనీకాంత్ సినిమా 'పెద్దన్న'లో ఆయనకి చెల్లెలిగా మెప్పించింది. ఆ సినిమాకి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోయినా, మంచి ఎమోషనల్ డ్రామాగా పేరు తెచ్చుకుంది. 

ఇక ఇప్పుడు అదే కీర్తి సురేశ్ 'భోళాశంకర్' సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలుగా కనిపించనుంది. గతంలో అజిత్ హీరోగా చేసిన 'వేదాళం' సినిమాకి ఇది రీమేక్. చెల్లెలు పాత్రలకి అంతగా టెన్షన్ పడవలసిన పనిలేదనీ, రజనీతో .. మెగాస్టార్ తో నటించాలనే తన ముచ్చటను ఇలా తీర్చుకున్నానని కీర్తి అంటోంది. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

Rajanikanth
Chiranjeevi
Keerthi Suresh

More Telugu News