Vande Bharat: మరో ఐదు వందే భారత్ రైళ్లకు జెండా ఊపనున్న ప్రధాని మోదీ

PM Modi will inaugurate five more Vande Bharat express trains
  • భారత్ లో పెరుగుతున్న వందే భారత్ రైళ్ల సంఖ్య
  • ఇప్పటికే పలు మార్గాల్లో సెమీ హైస్పీడ్ రైళ్లు
  • ఈ నెల 27న కొత్త వందే భారత్ రైళ్లకు ప్రారంభోత్సవం
భారత్ లో వందేభారత్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలో భాగంగా కేంద్రం వందే భారత్ రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేశారు. 

తాజాగా, ఈ నెల 27న మరో 5 వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. ఈ ఐదు రైళ్లు వివిధ మార్గాల్లో నడుస్తాయి. ముంబయి-గోవా, ఇండోర్-భోపాల్, పాట్నా-రాంచీ, జబల్పూర్-రాణి కమ్లాపాటి, బెంగళూరు-హుబ్లీ-ధార్వాడ్ మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు తీయనున్నాయి.
Vande Bharat
Semi High Speed Trains
Narendra Modi
India

More Telugu News