government: తెలంగాణకు రూ.2,102 కోట్ల నిధులు, ఆ జాబితాలో లేని ఆంధ్రప్రదేశ్!

Centre clears Rs 56415 crore to 16  states for capital investment
  • 16 రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద రూ.56,415 కోట్ల నిధుల విడుదల
  • బడ్జెట్ లో ప్రతిపాదించిన ప్రత్యేక సాయం పథకం కింద ఈ నిధుల కేటాయింపు
  • యాభై ఏళ్లకు గాను వడ్డీ లేని రుణంగా రాష్ట్రాలకు ఈ మొత్తం
పదహారు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మూలధన పెట్టుబడి కింద రూ.56,415 కోట్ల నిధులను విడుదల చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. బడ్జెట్ లో ప్రతిపాదించిన ప్రత్యేక సాయం పథకం కింద ఈ నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా తెలంగాణకు రూ.2,102 కోట్లు కేటాయించగా, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు జాబితాలో చోటు దక్కలేదు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట ప్రత్యేక పథకాన్ని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్ లో తీసుకువచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.3 లక్షల కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. యాభై ఏళ్లకు గాను వడ్డీ లేని రుణంగా ఈ మొత్తం రాష్ట్రాలకు వస్తుంది.

ఇందులో భాగంగా రూ.56,415 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ నిధులను విద్య, వైద్యం, నీటి పారుదల, మంచి నీటి సరఫరా, విద్యుత్, రోడ్ల నిర్మాణం కోసం వినియోగించవచ్చు. ఈ పథకం కింద ప్రస్తుతానికి నిధులు రానున్న రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు కూడా ఉన్నాయి. ఇక నిధుల కేటాయింపు విషయానికి వస్తే బీహార్ కు అత్యధికంగా రూ.9,640 కోట్లు మంజూరు చేసింది.
government
funds
Telangana
Andhra Pradesh
BJP

More Telugu News