Somu Veerraju: ఆ విషయం చంద్రబాబునే అడగండి.. సోము వీర్రాజు అసహనం

AP BJP Chief Somu Veerraju Says Jagan A Dubbing Artist
  • కేంద్ర పథకాలను తనవిగా చెబుతున్న జగన్ ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్న వీర్రాజు
  • కేంద్రం నిధులిస్తున్నా పోలవరం పూర్తిచేయడం లేదని మండిపాటు
  • బీజేపీ 9 ఏళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా చిత్తూరులో బహిరంగ సభ
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు సంగతేంటన్న ప్రశ్నకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని వెళ్లి చంద్రబాబునే అడగాలని విలేకరులకు సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరులో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిన్న బహిరంగ నిర్వహించారు. 

అనంతరం విలేకరులతో వీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర నిధులతో అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్న జగన్ ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులు ఇస్తున్నా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జగన్ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం అప్పులు, అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని విమర్శించారు.  
Somu Veerraju
BJP
TDP
Chandrababu

More Telugu News