Jagga Reddy: జరగబోయే నష్టం గురించి రాహుల్ గాంధీకి చెపుతా: జగ్గారెడ్డి

I will tell about the damage to party to Rahul Gandhi says Jagga Reddy
  • రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో అనేక లోపాలున్నాయన్న జగ్గారెడ్డి
  • పార్టీ అధికారంలోకి రాకపోతే చాలా మంది రాజకీయ జీవితాలు దెబ్బతింటాయని వ్యాఖ్య
  • పిల్ల చేష్టలు చేస్తే భారీ నష్టం తప్పదని హెచ్చరిక
తెలంగాణలో ఎన్నికల ఖర్చు బాగా పెరిగిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఎన్నికలంటే రూ. 20 కోట్లా, రూ. 30 కోట్లా అనే పరిస్థితి వచ్చేసిందని చెప్పారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలలో అనేక లోపాలు ఉన్నాయని... ప్రస్తుతం జరుగుతున్న పొరపాట్లు, జరగబోయే నష్టం గురించి రాహుల్ గాంధీకి నేరుగా చెపుతానని అన్నారు. 

ఈసారి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే చాలా మంది రాజకీయ జీవితాలు దెబ్బతింటాయని చెప్పారు. చిన్నపిల్లల చేష్టల మాదిరి వ్యవహరిస్తే భారీ నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణ అంటే ఆషామాషీ వ్యవహారం కాదని చెప్పారు. సభలు, సమావేశాల హడావుడి మామూలేనని... వాస్తవాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరాలని అన్నారు.
Jagga Reddy
Congress
Rahul Gandhi

More Telugu News