Prabhas: 'రాయల్'గా రానున్న రెబల్ స్టార్!

Prabhas and Maruthi Movie Update
  • ప్రభాస్ తో సినిమా చేస్తున్న మారుతి 
  • ఇప్పటికే 60 శాతం షూటింగు పూర్తి 
  • గతంలో అనుకున్న టైటిల్ 'రాజా డీలక్స్'
  • 'రాయల్' గా మార్చారంటూ టాక్ 
  • అతిథి పాత్రలో వర్మ కనిపించనున్నాడని ప్రచారం
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెంచకూడదనే ఉద్దేశంతో మారుతి చాలా సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయిందని చెబుతున్నారు. 
 
పీపుల్ మీడియావారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది ఒక సినిమా థియేటర్ నేపథ్యంలో నడిచే కథ అనీ, 'రాజా డీలక్స్' అనే పేరును ఖాయం చేయనున్నారని టాక్ వచ్చింది. కానీ ఈ టైటిల్ విషయంలో మేకర్స్ మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి 'రాయల్' అనే టైటిల్ కరెక్టుగా సెట్ అవుతుందని భావించి, రిజిస్టర్ కూడా చేయించారట. ఈ సినిమాకి దాదాపుగా ఈ టైటిల్ ఖరారైనట్టేనని అంటున్నారు. 

ఇక ఇందులో ప్రభాస్ జోడీగా నిధి అగర్వాల్ .. మాళవిక మోహనన్ .. రిధి కనిపించనున్నారు. ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో రామ్ గోపాల్ వర్మ కనిపించనున్నారని చెబుతున్నారు. మొత్తానికి మీడియం బడ్జెట్ మూవీ అంటూనే, పాన్ ఇండియా స్థాయి టైటిల్ ను మారుతి సెట్ చేశాడన్న మాట. 
Prabhas
Nidhi Agarwal
Malavika Mohanan
Maruthi

More Telugu News