Ambati Rayudu: రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా.. అంబటి రాయుడు

Team India ex cricketer Ambati Rayudu ready to fray in politics
  • ఇటీవల ఏపీ సీఎం జగన్‌ను కలిసిన రాయుడు
  • ప్రజల నాడి తెలుసుకునేందుకే గ్రామాల్లో పర్యటిస్తున్నట్టు వెల్లడి
  • ఎంపీగా పోటీ చేసే అవకాశం
రాజకీయ రంగ ప్రవేశంపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఊహాగానాలకు తెరదించాడు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు తాజాగా ప్రకటించాడు. రాయుడు ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్‌ను కలిసినప్పటి నుంచి అతని రాజకీయరంగ ప్రవేశంపై వార్తలు వస్తున్నాయి. అయితే, వీటిపై ఆయన స్పష్టంగా ఇప్పటి వరకు బదులివ్వలేదు. నిన్న గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించాడు.

 గ్రామీణుల సమస్యలు, అవసరాలు తెలుసుకుని వాటిలో తాను ఏ పనులు చేయగలను, ఏయే అవసరాలను తీర్చగలనన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెడతానని స్పష్టం చేశారు. ప్రజల నాడి తెలుసుకునేందుకు పర్యటిస్తున్నట్టు చెప్పాడు. రాయుడు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది.
Ambati Rayudu
Team India
politics
Guntur District

More Telugu News