Bihar: బీహార్ విద్యాశాఖలో జీన్స్, టీషర్ట్ లపై నిషేధం
- కేవలం ఫార్మల్ డ్రెస్ లోనే రావాలని బీహార్ విద్యాశాఖ ఆదేశం
- జీన్స్, టీషర్ట్ వల్ల ఆఫీస్ కల్చర్ దెబ్బతింటోందని అభ్యంతరం
- తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడి
బీహార్ రాష్ట్ర విద్యాశాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. విద్యాశాఖ కార్యాలయాల్లో పని చేసేవారు కేవలం ఫార్మల్ డ్రెస్ లోనే రావాలని, జీన్స్, టీషర్ట్ వంటి క్యాజువల్స్ వేసుకుని రాకూడదని ఆదేశించింది. ఉద్యోగులు ఇష్టం వచ్చిన రీతిలో దుస్తులు ధరించి వస్తున్నారని... దీనివల్ల ఆఫీస్ కల్చర్ దెబ్బతింటోందని విద్యాశాఖ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) పేరుతో విడుదలైన ఆర్డర్ లో పేర్కొన్నారు.
టీషర్ట్, జీన్స్ వంటి క్యాజువల్స్ పై నిషేధం విధిస్తున్నామని... ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. మరోవైపు ఈ ఆదేశాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ ఇంతవరకు స్పందించలేదు. ఇంకోవైపు 2019లోనే సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు జీన్స్ టీషర్ట్ వేసుకురావడంపై బీహార్ ప్రభుత్వం నిషేధం విధించింది. సింపుల్ గా, లైట్ కలర్ లో ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలని ఆదేశించింది.