Rajamouli: ఆస్కార్ కమిటీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌కు చోటుదక్కడంపై రాజమౌళి స్పందన ఇదే!
- ఆర్ఆర్ఆర్ బృందంలోని ఆరుగురిని ఆహ్వానించినందుకు గర్వంగా ఉందన్న రాజమౌళి
- తారక్, చరణ్ సహా అందరికీ అభినందనలు తెలిపిన జక్కన్న
- ఆహ్వానం అందుకున్న ఇతరులకీ కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్
ముందు కలెక్షన్ల రికార్డులు కొల్లగొట్టి.. తర్వాత లెక్కలేనన్ని అంతర్జాతీయ అవార్డులతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రపంచస్థాయిలో ఖ్యాతి పొందిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీమ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా ఆస్కార్ కమిటీలో ఆరుగురికి అవకాశం లభించింది.
దీనిపై దర్శక ధీరుడు రాజమౌళి ట్విట్టర్‌లో స్పందించారు. ఈ సంవత్సరం అకాడమీ అవార్డుల కోసం తమ ఆర్ఆర్ఆర్ బృందంలోని ఆరుగురిని సభ్యులుగా ఆహ్వానించినందుకు చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. తారక్, చరణ్, పెద్దన్న (కీరవాణి), సాబు, సెంథిల్, చంద్రబోస్‌కు అభినందనలు తెలిపారు. అలాగే ఈ సంవత్సరం ఆహ్వానం అందుకున్న భారతీయ సినిమా సభ్యులందరికీ అభినందనలు చెబుతూ ట్వీట్ చేశారు.
ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే ‘ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్తగా ఆస్కార్ కమిటీలో 398 మందికి సభ్యత్వం కల్పించింది. ఇందులో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌కు చెందిన ఆరుగురు ఉండడం విశేషం. స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సిరిల్‌కు ఈ కమిటీలో స్థానం దక్కింది.
అయితే రాజమౌళికి మాత్రం చోటులేకపోవడం గమనార్హం. రాజమౌళికి కూడా స్థానం కల్పించి ఉంటే బాగుండేదంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దిగ్గజ దర్శకుడు మణిరత్నం, బాలీవుడ్ మూవీ మేకర్ కరణ్‌జోహార్‌కు కూడా ఆస్కార్ కమిటీ ఆహ్వానం పలికింది.
అయితే రాజమౌళికి మాత్రం చోటులేకపోవడం గమనార్హం. రాజమౌళికి కూడా స్థానం కల్పించి ఉంటే బాగుండేదంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దిగ్గజ దర్శకుడు మణిరత్నం, బాలీవుడ్ మూవీ మేకర్ కరణ్‌జోహార్‌కు కూడా ఆస్కార్ కమిటీ ఆహ్వానం పలికింది.