YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగించిన సీబీఐ కోర్టు
- జులై 14 వరకు రిమాండ్ ను పొడిగించిన సీబీఐ కోర్టు
- నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
- కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు రిమాండ్ ను పొడిగించింది. జులై 14 వరకు రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఈరోజు విచారణ సందర్భంగా కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను సీబీఐ దాఖలు చేసింది. ఇందులో కీలక వ్యక్తుల పేర్లను సీబీఐ ప్రస్తావించింది.