Amazon: ఆన్ లైన్ షాపింగ్ లో వీటికే ఎక్కువ డిమాండ్

This Indian city spends maximum time on Amazon and it is not Delhi or Mumbai
  • అమెజాన్ లో బెంగళూరు వాసులు అధిక సమయం షాపింగ్
  • స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు ఎక్కువ
  • క్లాత్స్, యాక్సెసరీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు డిమాండ్
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తోపాటు, మీషో తదితర ప్లాట్ ఫామ్ లపై ఏ పట్టణ వాసులు ఎక్కువ సమయం గడుపుతున్నారో తెలుసా? సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) ఇటీవలే దీనిపై ఓ సర్వే నిర్వహించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అమెజాన్ పై ఇతర పట్టణ వాసులతో పోల్చినప్పుడు బెంగళూరు వాసులు అధిక సమయం వెచ్చిస్తున్నారు. ఒక్కో వ్యక్తి సగటున ఒక వారంలో అమెజాన్ పై 4 గంటల సమయం గడుపుతున్నారు. టైర్1, టైర్ 2 పట్టణాల్లో షాపింగ్ అలవాట్లను తెలుసుకునే ప్రయత్నాన్ని ఈ సర్వే చేసింది.

టైర్ 2 పట్టణాలైన గువాహటి, కోయింబత్తూర్, లక్నో వాసులు ఆన్ లైన్ షాపింగ్ పై అధిక సమయం గడుపుతున్నారు. ఈ పట్టణాల వాసులు వారంలో సగటున 2 గంటల 25 నిమిషాలు ఆన్ లైన్ షాపింగ్ కోసం వెచ్చిస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మీషో, టాటా, రిలయన్స్ సంస్థలు ప్రధాన సంస్థలుగా మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కువ కవరేజీతో కూడిన అమెజాన్ పట్ల ఎక్కువ మంది కస్టమర్లు సానుకూల అభిప్రాయంతో ఉన్నారు. 

ధరలు ఆకర్షణీయంగా ఉండడం, నచ్చకపోతే తిప్పి పంపించే సౌకర్యం, ఎక్చేంజ్ చేసుకునే సౌలభ్యం, మంచి ఆఫర్లు ఆన్ లైన్ లో వినియోగదారులు కొనుగోళ్లు చేయడానికి సానుకూలతలుగా ఉన్నాయి. మహిళా వ్యాపారవేత్తలు, ఇతరులు ఏడాదిలో 149 గంటల పాటు ఈ కామర్స్ పై వెచ్చిస్తున్నారు. అంటే నెలకు 12 గంటలకు పైనే గడుపుతున్నారు. 

స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా కొంటున్నారు. టైర్ 1 పట్టణాల మాదిరే, టైర్ 2 పట్టణ వాసులు కూడా అంతే సమయం ఆన్ లైన్ షాపింగ్ కోసం వెచ్చిస్తున్నారు. టైర్ 1 నుంచి ఒక్కొక్కరు సగటున గత ఆరు నెలల్లో రూ.21,700 కొనుగోలు చేయగా, టైర్ 2 నుంచి ఒక్కో యూజర్ రూ.20,100 చొప్పున వెచ్చించారు. క్లాతింగ్, యాక్సెసరీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్లు, హెడ్ ఫోన్లు/ఇయర్ ఫోన్లు, స్మార్ట్ బ్యాండ్స్/స్మార్ట్ వాచెస్ టాప్ 3 కొనుగోళ్లుగా ఉన్నాయి.
Amazon
meesho
flipkart
online shopping
major purchase

More Telugu News