Zomato: జొమాటో బోయ్ బర్త్ డే.. ప్రతి ఆర్డర్ డెలివరీతోపాటు ఓ గిఫ్ట్ 

Zomato delivery executive celebrates birthday by distributing chocolates to customers with every order
  • ప్రతీ ప్యాక్ కు 5 స్టార్ చాక్లెట్ స్టిక్ చేసి డెలివరీ
  • మెచ్చుకుంటున్న నెటిజన్లు
  • డెలివరీ బోయ్ కు ప్రత్యేకంగా కేక్ పంపించిన జొమాటో
సమ్ థింగ్ స్పెషల్ అంటే ఇదే. ఓ జొమాటో డెలివరీ బోయ్ పుట్టిన రోజుని రొటీన్ కు భిన్నంగా జరుపుకున్నాడు. తాను డెలివరీ చేసిన ప్రతీ ఆర్డర్ తోపాటు ఉచితంగా ఓ చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. అదే 5స్టార్ చాక్లెట్. రేటు ఎంతన్నది ఇక్కడ చూడొద్దు. ఎంతయినా కానీయండి, ప్రతీ డెలివరీ ప్యాక్ కు అనుబంధంగా చాక్లెట్ స్టిక్ చేసి ఇవ్వడం ద్వారా తన సంతోషాన్ని తీర్చుకున్నాడు. ఫుడ్ ఆర్డర్ డెలివరీ తీసుకున్న కస్టమర్లలోనూ సంతోషానికి కారకుడయ్యాడు. 

జొమాటో డెలివరీ బోయ్ కరణ్ ఆప్టే 30వ పుట్టిన రోజు సందర్భంగా ఇలా చేశాడు. ఆ రోజంతా ప్రతీ ఆర్డర్ తోపాటు 5స్టార్ చాక్లెట్ ఉచితంగా పంచాడు. దీన్ని ఫేస్ బుక్ లో స్నేహితులతో పంచుకోవడంతో ప్రచారంలోకి వచ్చింది. దీంతో సోషల్ మీడియా యూజర్లు కరణ్ ఆప్టే చర్యను అభినందిస్తున్నారు. ఈ విషయం జొమాటోకి తెలియడంతో కరణ్ కు ప్రత్యేకంగా బర్త్ డే కేక్ ను పంపించింది. దానికి ఆప్టే ధన్యవాదాలు తెలిపాడు. 
Zomato
delivery boy
celebrates birthday
distributing chocolates

More Telugu News