UPSC: ఐఎఫ్ఎస్ ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ... బాపట్ల కుర్రాడికి మొదటి ర్యాంకు
- గతేడాది ఐఎఫ్ఎస్ పరీక్ష నిర్వహించిన యూపీఎస్సీ
- ఈ ఏడాది జూన్ లో ఇంటర్వ్యూలు
- మొత్తం 147 మందిని ఐఎఫ్ఎస్ కు ఎంపిక చేసిన యూపీఎస్సీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్-2022 ఫలితాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 147 మంది ఐఎఫ్ఎస్ కు ఎంపికయ్యారు.
బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ కు మొదటి ర్యాంకు లభించింది. హైదరాబాద్ కు చెందిన సాహితీరెడ్డికి 48వ ర్యాంకు, తొగరు సూర్యతేజకు 66వ ర్యాంకు లభించాయి. సాహిల్ పోశ్వాల్ రెండో ర్యాంకు, అనురాధ మిశ్రాకు 3వ ర్యాంకు సాధించారు.
పూర్తి ఫలితాలు https://www.upsc.gov.in/sites/default/files/FR-IFSM-22-engl-010723.pdf లింకు ద్వారా యూపీఎస్సీ పోర్టల్ లో చూసుకోవచ్చు.
ఐఎఫ్ఎస్-2022 పరీక్షను యూపీఎస్సీ గతేడాది నవంబరు 20 నుంచి 27 వరకు నిర్వహించింది. ఈ ఏడాది జూన్ లో ఇంటర్వ్యూలు చేపట్టింది.