Nara Lokesh: నెల్లూరును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం: నారా లోకేశ్

Lokesh assures they will develop Nellore as smart city after TDP win
  • యువగళం పాదయాత్రకు నేడు 144వ రోజు
  • నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగళం
  • రేపు మహిళాశక్తితో లోకేశ్ కార్యక్రమం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 144వ రోజు నెల్లూరు రూరల్ కాకుపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా యువనేతకు మహిళలు హారతులతో నీరాజనాలు పడుతూ, దిష్టి తీస్తూ ఘనస్వాగతం పలికారు. లోకేశ్ తనని చూడటానికి వచ్చిన మహిళలు, యువత, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. 

ఇదిలా వుండగా యువగళంలో భాగంగా లోకేశ్ సోమవారం ఉదయం 11గంటలకు అనిల్ గార్డెన్స్ లో మహాశక్తితో లోకేశ్ పేరిట మహిళలతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. 

ఇవాళ పాదయాత్రలో భాగంగా లోకేశ్ వివిధ వర్గాలతో సమావేశమయ్యారు. వారు చెప్పిన సమస్యలను ఆయన సానుకూల ధోరణితో విన్నారు.

ప్రజాసమస్యల పట్ల లోకేశ్ స్పందన...

  • ముఖ్యమంత్రి జగన్ కు దోచుకోవడం తప్ప ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై శ్రద్ధ లేదు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. కాంట్రాక్టర్లకు లక్ష కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉండటంతో టెండర్లు పిలిచినా పరారవుతున్నారు. టీడీపీ వచ్చాక గుండ్లపాడు – కృష్ణపట్నం ఓడరేవు రోడ్డును 4 లైన్లుగా మార్చుతాం.
  • టీడీపీ అధికారంలోకి రాగానే బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం. ఆదరణ పథకాన్ని పునరుద్దరించి కులవృత్తులు చేసుకునే వారికి 90 శాతం సబ్సిడీపై పనిముట్లు అందజేస్తాం. 
  • ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేస్తాం. పెద్దఎత్తున పరిశ్రమలు రప్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం, ఉద్యోగం వచ్చేవరకు యువగళం నిధి కింద యువతకు రూ.3 వేల రూపాయల పెన్షన్ ఇస్తాం.
  • అందరికీ విద్య అనేది ప్రాథమిక హక్కు… స్కూళ్ల విలీనంతో జగన్ పేదలకు విద్యను దూరం చేస్తున్నారు. సంస్కరణల పేరుతో విద్యను నిర్వీర్యం చేస్తున్నారు. నాడు-నేడు పేరుతో వేల కోట్లు దోచుకోవడం తప్ప విద్యాప్రమాణాల మెరుగుదలకు ఎటువంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదు.
  • పేదవాడికి ఇచ్చే సెంటు పట్టాలను సైతం వైసీపీ దొంగలు ఆదాయవనరుగా మార్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొండలు, గుట్టలు, వాగులు, వంకల్లో పనికిరాని స్థలాలు అంటగట్టి రూ.7 వేల కోట్లు దోచుకున్నారు. 
  • పనికి రాని స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టుకోకుంటే స్థలం రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. 
  • ఇల్లు కట్టుకోలేదన్న సాకుతో రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మందికి కేటాయించిన స్థలాలను రద్దు చేశారు.
  • జగన్ అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు అన్న చందంగా పన్నులు పెంచడం తప్ప మౌలిక సదుపాయాలపై దృష్టిసారించిన దాఖలాలు లేవు. పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల పరిష్కారంపై లేదు. 
  • కాంట్రాక్టర్లకు పెద్దఎత్తున బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో రోడ్లపై తట్ట మట్టి వేసే నాథుడే కరవయ్యాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం – 1892.6 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం – 8.6 కి.మీ.*

*145వ రోజు యువగళం వివరాలు (3-7-2023)*

*నెల్లూరు రూరల్ నియోజకవర్గం(నెల్లూరు జిల్లా)*

ఉదయం

11.00 నుంచి 1.00 వరకు – నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో “మహాశక్తితో లోకేశ్” పేరిట మహిళలతో యువనేత నారా లోకేశ్ ముఖాముఖి.

మధ్యాహ్నం

1.00 – భోజన విరామం, అనంతరం అనిల్ గార్డెన్స్ లో బస.
Nara Lokesh
Nellore
Smart City
Nellore Rural
Yuva Galam Padayatra
TDP

More Telugu News