Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
- గత మూడ్రోజులుగా తిరుమల కొండపై అధికంగా భక్తుల రద్దీ
- నేడు 5 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
- శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
- నిన్న హుండీ ద్వారా స్వామివారికి రూ.4.20 కోట్ల ఆదాయం
తిరుమలలో గత మూడ్రోజుల పాటు కొనసాగిన రద్దీ నేడు (సోమవారం) తగ్గింది. టోకెన్ లేకుండా క్యూ లైన్లలోకి వచ్చిన భక్తులు 5 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 8 గంటల సమయం పడుతోంది. కాగా, నిన్న తిరుమలలో రద్దీ కొనసాగింది. ఆదివారం నాడు స్వామివారిని 87,967 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,083 మంది తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే తిరుమల వెంకన్నకు హుండీ ద్వారా రూ.4.2 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.