NTR: ఫైటింగ్ మూడ్ లో 'దేవర'... రేపటి నుంచి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

Fight scenes shooting for Devara will start from tomorrow
  • ఎన్టీఆర్, కొరటాల కలయికలో దేవర
  • శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం
  • పీటర్ హెయిన్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్
  • అనంతరం సాల్మన్ మాస్టర్ పర్యవేక్షణలో మరో ఫైట్ చిత్రీకరణ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ చిత్రం దేవర. ఈ సినిమా ఐదో షెడ్యూల్ కు సంబంధించిన అప్ డేట్ ను చిత్రబృందం నేడు వెల్లడించింది. 

రేపటి నుంచి కీలక పోరాట సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఎన్టీఆర్ కూడా పాల్గొనే ఈ యాక్షన్ సీక్వెన్స్ లను ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో చిత్రీకరించనున్నారు. 

ఈ యాక్షన్ సీక్వెన్స్ ముగిసిన వెంటనే... సల్మాన్ మాస్టర్ పర్యవేక్షణలో మరికొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సాల్మన్ మాస్టర్ గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ఎపిక్ మూవీస్ కు పనిచేశారు. ఇప్పుడాయన ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె చిత్రానికి కూడా పనిచేస్తున్నారు. 

దేవర చిత్రం కోసం ఇటీవలే హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలోనూ పలు ఫైట్ సీన్లు చిత్రీకరించినట్టు తెలుస్తోంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న దేవర చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
NTR
Devara
Fights
Shooting
Koratala Siva

More Telugu News