Heavy Hyderabad: తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు కుమ్మేయనున్న వర్షాలు

Heavy Rains Expected In Telangana Three Days From Today

  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం
  • ప్రయాణాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
  • మరోవైపు 9 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు

తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు అంటే గురువారం వరకు వర్షాలు కుమ్మేయనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చేటప్పుడు, ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 

నిజామాబాద్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగరి, హనుమకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్‌ కర్నూలు, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో నేడు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.

ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు రాష్ట్రంలోని 9 జిల్లాలు.. పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, హనుమకొండ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్టు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి తెలిపింది. ఈ జిల్లాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైందని పేర్కొంది.

  • Loading...

More Telugu News