Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్ నేత పొంగులేటితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ

Komatireddy Rajagopal Reddy meets Ponguleti

  • రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
  • ఘర్ వాపసీ అవుతారని జోరుగా ప్రచారం
  • ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీతో భేటీకి ప్రాధాన్యత

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొన్నిరోజుల క్రితం రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో నేడు పొంగులేటితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ లో తిరిగి చేరడంపై పొంగులేటితో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఘర్‌వాపసీ అవుతారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో పొంగులేటితో సమావేశం కావడం గమనార్హం.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఏడాది కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా లేదని, బీఆర్ఎస్‌పై పోరాటం చేసే పరిస్థితుల్లో లేదని, జాతీయ నాయకత్వం కూడా బలహీనపడిందని, కేసీఆర్ ను ఓడించాలంటే బీజేపీకే సాధ్యమని అప్పుడు చెప్పారు. తాను బాధతోనే కాంగ్రెస్ ను వీడుతున్నట్లు చెప్పారు. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది.

  • Loading...

More Telugu News