USA: అమెరికా శ్వేతసౌధంలో దొరికిన కొకైన్

 White Powder Found At White House Identified As Cocaine

  • వైట్ హౌజ్ వెస్ట్ వింగ్‌లో తెల్లటి ప్యాకెట్‌ను గుర్తించిన సీక్రెట్ స‌ర్వీస్ ఏజెంట్లు
  • ప్రాథమిక పరీక్షల్లో కొకైన్ మాదక ద్రవ్యంగా గుర్తింపు
  • ఆ సమయంలో వైట్ హౌజ్‌లో లేని జో బైడెన్

అమెరికా అధ్యక్షుడు నివాసం ఉండే శ్వేతసౌధంలో కొకైన్ మాదకద్రవ్యం బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవ‌ల వైట్ హౌజ్‌లో ఓ తెల్ల‌టి పౌడర్ ను అధికారులు గుర్తించారు. వైట్‌హౌజ్‌లోని పడమర దిక్కున సీక్రెట్ స‌ర్వీస్ ఏజెంట్లకు ఆ పౌడ‌ర్ దొరికింది. ఆ సమయంలో అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌజ్ లో లేరు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి.. సదరు కాంప్లెక్స్‌లో ఉన్న వారిని మ‌రో ప్ర‌దేశానికి త‌ర‌లించారు. ఆ పౌడర్ ను ఫైర్ అండ్ ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసు సిబ్బంది ప‌రీక్షించారు. ప్రాథ‌మిక ప‌రీక్ష‌లో అది కొకైన్ అని తేలింది. దీన్ని నిర్ధారించేందుకు సదరు ప్యాకెట్ ను మరిన్ని పరీక్షల కోసం పంపించారు.

అందులోనూ అది కొకైన్ అని తేలినట్టు తెలుస్తోంది. దీన్ని అధికారులు నిర్థారించలేదు. అయితే ఆ పౌడ‌ర్ ఎలా వైట్‌హౌజ్ లోకి వచ్చిందన్న దానిపై సీక్రెట్ స‌ర్వీస్ ఏజెంట్లు ద‌ర్యాప్తు చేస్తున్నారు. వైట్‌హౌజ్ వెస్ట్ వింగ్ అధ్య‌క్ష భ‌వ‌నానికి స‌మీపంలోనే ఉంటుంది. ఈ వెస్ట్ వింగ్ కు పలు పనుల కోసం రోజూ వందలాది మంది ప్రజలు వస్తుంటాయి. అయితే, వారిని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతనే లోనికి పంపిసారు. మరి, ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌజ్ లోనికి కొకైన్ ప్యాకెట్ ఎలా వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

  • Loading...

More Telugu News