Shivraj Singh Chouhan: మూత్ర విసర్జన బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణలు చెప్పిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

 Shivraj Chouhan washes feet of tribal amid urination incident row

  • మూత్ర విసర్జన ఘటన తనను కలచివేసిందన్న శివరాజ్‌సింగ్
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఇంటిని కూల్చేసిన అధికారులు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న మూత్ర విసర్జన బాధితుడు, గిరిజన కూలీ దాస్మేష్ రావత్‌ పాదాలు కడిగి సత్కరించారు. జరిగిన ఘటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరారు. సిద్ధి జిల్లాలో పర్వేష్ శుక్లా అనే నిందితుడు దాస్మేష్‌పై మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ స్వయంగా స్పందించి నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయమని ఆదేశించారు. నిందితుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 

నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎస్సీ ఎస్టీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడి ఇంటిని అధికారులు బుల్డోజర్‌తో కూల్చివేశారు. బాధిత కూలీని కలవడానికి ముందు సీఎం మాట్లాడుతూ ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. తన హృదయం బాధతో నిండిపోయిందని పేర్కొన్నారు. బాధితుడిని, ఆయన కుటుంబాన్ని భోపాల్‌లో కలవనున్నట్టు చెప్పారు. ఆ తర్వాత దాస్మేష్‌ను కలిసిన సీఎం ఆయన కాళ్లు కడిగి శాలువాతో సత్కరించారు. ఆపై జరిగిన ఘటనకు క్షమాపణలు తెలిపారు.

  • Loading...

More Telugu News